కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపునకే మీటర్లు పెడుతున్నామని మంత్రి బాలినేని తెలిపారు. విద్యుత్ నగదు బదిలీతో రైతులపై ఒక్క రూపాయి భారం మోపబోమని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని... ఒకవేళ రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యుత్‌ మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్కరణల్లో భాగంగా నగదు బదిలీ చేయబోతున్నట్లు చెప్పారు.


బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు వైఎస్ఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని... రాజన్న బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ పేదప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మంత్రి బాలినేని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: