ఐపీఎల్​లో చెన్నైని మరో పరాజయం పలకరించింది. గత మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టుకు కోల్‌కతా చేతిలో ఓటమి పాలైంది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ధోనీసేన. 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (50; 40 బంతుల్లో 6×4, 1×6), అంబటి రాయుడు (30; 27 బంతుల్లో 3×4) మినహా మరెవ్వరూ రాణించలేదు. అంతకు ముందు కోల్‌కతాలో రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8×4, 3×6) అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా విఫలమయ్యారు.


ఛేదనలో చెన్నైకి శుభారంభమే లభించింది. డుప్లెసిస్ (17).. శివమ్‌ మావి వేసిన 3.4వ బంతికే ఔటైనా షేన్‌ వాట్సన్‌ దూకుడుగా ఆడాడు. అంబటి రాయుడు (30; 27 బంతుల్లో)తో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ వరుసగా షాట్లు బాదడం.. 12వ ఓవర్‌ ముగిసినా మరో వికెట్‌ పడకపోవడం వల్ల డీకే సేన బెంబేలెత్తిపోయింది. చెన్నై విజయంపై ఎవరికీ అనుమానాలు కలగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: