అబుదాబి వేదికగా కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో ధోనీసేన గెలవడం వల్ల పంజాబ్​ ప్లేఆఫ్​ ఆశలు గల్లంతవ్వడం సహా టోర్నీ లీగు దశలోనే వైదొలిగింది. ఈ మ్యాచ్​లో యువ బ్యాట్స్​మన్​ రుతురాజ్​ గైక్వాడ్​ (62) హాఫ్​ సెంచరీతో అలరించగా.. ఫాఫ్​ డుప్లెసిస్ (48)​, అంబటి రాయుడు (30) అద్భుతమైన ఇన్నింగ్స్​తో సీఎస్కేకు గెలుపును అందించారు.


అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​కు బ్యాట్స్​మన్​ దీపక్ హుడా అర్ధశతకంతో చెలరేగి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. మొదట పంజాబ్‌కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (29), మయాంక్ అగర్వాల్ (26) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: