గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో  పర్యటించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ రంగనాధ్ రాజు, ఎమ్మెల్యే ముస్తఫా కీలక వ్యాఖ్యలు చేసారు. రోగుల సహాకుల విశ్రాంతి భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి... మీడియాతో మాట్లాడారు. సహాయకులకు కూడా రెండు పూటల ఉచిత భోజనం పెట్టేందుకు ప్రత్యేక భవనం నిర్మాణం జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. డిశంబర్ పదవ తేదీ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించాం అన్నారు.

ఫైవ్ స్టార్ హోటల్ లాగా కిచెన్, మూడు వందల మంది కూర్చుని భోజనం చేసేలా భవన నిర్మాణం జరుగుతుందని, డిశంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై ముఖ్య మంత్రి కమిటీలను ఏర్పాటు చేశారు అని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: