గుంటూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్ సీపీకి కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో షాకులు త‌ప్ప‌లేదు. వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్న కుమారుడు స్వ‌గ్రామంలో ఓడిపోయారు. తెనాలి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ 11, వైసీపీ 31 చోట్ల గెలిచాయి. వేమూరులో వైసీపీ 43, టీడీపీ 16 చోట్లా, రేప‌ల్లెలో టీడీపీ 14, వైసీపీ 35 చోట్లా గెలిచాయి. పొన్నూరులో టీడీపీ 8, వైసీపీ 15 చోట్లా గెలిచాయి. బాప‌ట్ల‌లో టీడీపీ 11, వైసీపీ 20 చోట్లా గెలిచాయి. పొన్నూరులో ఇద్ద‌రు వైసీపీ రెబల్స్‌, బాప‌ట్లలో ఆరుగురు వైసీపీ రెబ‌ల్స్ గెలిచారు.

ఇక ఇదే జిల్లాలో తెనాలిలో 3 జ‌న‌సేన స‌ర్పంచ్‌లు, వేమూరులో మూడు జ‌న‌సే, రేప‌ల్లెలో రెండు జ‌న‌సేన ఖాతాలో ప‌డ్డాయి. ఏదేమైనా వేమూరు, పొన్నూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం అధికార పార్టీకి అనుకున్న స్థాయిలో ఫ‌లితాలు రాలేద‌నే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: