ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌గ‌టి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి వ‌చ్చింది. ప్ర‌తి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌నలు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. రెండు వారాల పాటు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. ఈ నేప‌థ్యంలో apsrtc చ‌ర్య‌లు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పగటి కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో rtc పలు చర్యలకు ఉపక్రమించింది. దూర ప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లను నిలిపేసింది. దూర‌ప్రాంతాల‌కు న‌డిచే అన్ని బ‌స్సు స‌ర్వీసుల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసింది. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపు గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునే దూర‌ప్రాంత బ‌స్సుల‌కే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపింది. బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పడు బస్సులను ఏర్పాటు చేయనుంది. మ.12 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు. ఈ సమయం తర్వాత గమ్యస్థానాలు చేరుకునే సర్వీసులను సైతం ఆర్టీసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: