‘దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ యాక్టివ్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖలు రాశారు. ఇక మీదట కూడా కట్టడి చర్యలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.  

 ఏదైనా లాక్ డౌన్ సడలింపులు లాంటివి ఇవ్వాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయంలో స్థానిక పరిస్థితులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీగా నిర్ణయం తీసుకోవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రకృతి విపత్తు నియంత్రణ చట్టం కింద దేశంలో కరోనా కట్టడి కోసం ఏప్రిల్‌ 29న జారీ చేసిన మార్గదర్శకాలను జూన్‌ 30 వరకు కొనసాగించాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: