దేశ రాజ‌ధాని ఢిల్లీలో నేటి నుంచి అన్‌లాక్ ప‌క్రియ ప్రారంభం కానుంది.నెల రోజుల త‌రువాత ఢిల్లీలో షాపులు తెరుచుకున్నాయి.అయితే అన్ని షాపులు ఒకే రోజు తెరిచేందుకు అనుమ‌తి లేదు.స‌రి,బేసి సంఖ్య విధానంలో మార్కెట్లు,మాల్స్‌,షాపులు తెర‌వాల‌ని ఢిల్లీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాల్స్,మర్కెట్స్,అనుమతి ఇచ్చారు.50% సిబ్బందితో ప్రైవేట్ కార్యాలయాల నిర్వహణకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.మాస్క్ లు,సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఢిల్లీ మెట్రో రైళ్ల‌లో 50 శాతం ప్ర‌యాణికుల‌తో న‌డ‌వ‌నున్నాయి.స్పా,సెలూన్, జిమ్‌ల‌కు ప్రభుత్వం ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: