దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతానికి చాలా మందగించింది, కానీ దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, రోజువారీ కేసుల సంఖ్య ఇప్పటికీ భయపెడుతోంది. మరీ ముఖ్యంగా కేరళలో పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూలై 17 మరియు 18 తేదీలలో పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. దీనితో పాటు, జూలై 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు సంబందించిన కొత్త మార్గదర్శకాలను కూడా జారీ చేయవచ్చు. ఇక కేరళలోని బ్యాంకులు వారానికి ఐదు రోజులు పనిచేయడానికి అనుమతించబడతాయని అంటున్నారు.ఇక కేరళలో కూడా జికా వైరస్ గురించి ఆందోళన పెరుగుతోంన్న క్రమంలో మరింత టెన్షన్ నెలకొంది. మరో మూడు జికా వైరస్ కేసులు మంగళవారం నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18కి చేరుకుంది. ఇక కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ 22 నెలల శిశువుకు వ్యాధి సోకినట్లు గుర్తించామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: