తూర్పుగోదావరి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం నేపథ్యంలో దేవీపట్నం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే జలదిగ్బంధంలో చాలా గ్రామాలు చిక్కుకుపోయాయి. రాత్రి గోదావరికి వరద 48 అడుగులు దాటింది. ఇక భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ఈ వరద ప్రవాహం కనిపిస్తోంది. 


ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి కూడా వరద చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.. వశిష్ట, వైనతేయ, గౌతమీ నది పాయలలోకి కూడా గోదావరి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక ప.గో జిల్లా పోలవరం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. స్పిల్ వే వద్ద 32.8 మీటర్లకి గోదావరి వరద నీరు చేరింది. కాపర్ డ్యాం వద్ద 34.3 మీటర్లకు వరద నీరు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: