పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో తన నివాసంలో సమావేశం అయ్యారు. ఢిల్లీ లో మమత అధికార నివాసం లో ప్రధాని ఈ భేటీ జరగగా, ఈ సమావేశంలో ఏ విషయాలు చర్చకు వచ్చాయి అనే విషయం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఢిల్లీ కి మమత బెనర్జీ తన ఐదు రోజు పర్యటన లో పలు కీలక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. పశ్చిమబెంగాల్ లో బీజేపీ పార్టీ పై మమత బెనర్జీ ఘన విజయం సాదించిన తర్వాత నరేంద్ర మోదీ తో భేటీ కావడం ఇదే మొదటి సారి. ఇక బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ తో సమావేశం కానుండగా, ఈ భేటీ అనంతరం టీఎంసీ పార్టీ ఎంపీలతో మమత కలవనున్నారు. పెగసాస్ స్పైవేర్ స్నూపింగ్ వివాదంపై చర్చించడానికి మరియు సుప్రీంకోర్టు నేతృత్వంలోని దర్యాప్తుపై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని మమత డిమాండ్ చేసినట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: