మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఈరోజు స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఈటల కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన కాళ్ళకు పొక్కులు రావడంతో పాటు ఒళ్ళు నొప్పులు మరియు జ్వరం వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా బిపి మరియు ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయినట్టు డాక్టర్ లు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

వీణవంక మండలం కొండపాక వద్ద అస్వస్థతకు గురవడంతో ఈటల తన పాదయాత్రను అక్కడ నిలిపివేశారు. ఇదిలా ఉండగా ఈటల పాదయాత్ర 12వ రోజు కూడా కొనసాగింది. ఇక ఇప్పటి వరకు మొత్తం 225 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. అంతేకాకుండా రోజుకు దాదాపు పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తన పాదయాత్రలో ఈటల చాలా మంది ప్రజలను కలుస్తున్నారు. జ్వరం వచ్చినప్పటికీ పాదయాత్రను కొనసాగించడంతో అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: