టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రోలో దేశానికి స్వ‌ర్ణ‌ప‌త‌కం అందించిన నీర‌జ్‌చోప్రాకు తెలంగాణ రాష్ట్ర స‌మితి అభినంద‌న‌లు తెలుపుతూ ట్వీట్ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా బంగారు ప‌త‌కం గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. జావెలిన్‌ను 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిచాడు. అథ్లెటిక్స్‌లో భార‌త్‌కు 100 సంవ‌త్స‌రాల క‌ల‌ను నిజం చేశాడు.తొలి ప్ర‌య‌త్నంలో 87.03 మీట‌ర్ల దూరం విసిరాడు. రెండో ప్ర‌య‌త్నంలో మ‌రింత ప‌దునుగా విసిరాడు. 87.58 మీట‌ర్ల దూరం విసిరి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాల్ విస‌ర‌డంతో అక్క‌డే అత‌ని విజ‌యం ఖాయ‌మైంది. క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లో మొద‌టి త్రో విసిరే టాప్లో నిలిచాడు. వ్య‌క్తిగ‌తంగా గ‌తంలో 88.07 మీట‌ర్లు విసిరాడు. టోక్యో ఒలిపింక్స్ లో ఇదే త‌ర‌హా ఆట‌తీరును క‌న‌ప‌ర‌చ‌డంలో భార‌త‌దేశానికి ఒక స్వ‌ర్ణ‌ప‌త‌కం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా నీర‌జ్ చోప్రాకు దేశ‌వ్యాప్తంగా అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, దిగ్గ‌జ వ్యాపార‌వేత్త‌ల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రికీ నీర‌జ్ చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రోజుగా మిగిల్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag