రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది అని ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 42 శాతం బడ్జెట్ అంచనాలకు మించి ప్రభుత్వం అప్పులు చేసిందని రఘురామ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్న తీరు చూస్తుంటే పరిస్థితి భయంకరంగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కదులుతుందో అని తనకు భయం వేస్తోందని పేర్కొన్నారు.

బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఉన్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో ఏపీ అప్పుల ఊబిలో కూరుకు పోనుందని పేర్కొన్నారు. రాష్ట్రం చేస్తున్న అప్పులో 42 శాతం పాత అప్పుల పై వడ్డీ చెల్లించడానికి సరిపోతుందని సంచలన ఆరోపణలు చేశారు. జులై రెండవ వారం వరకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు చెల్లించలేదని రఘురామ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేదని ఆరోపణలు చేశారు. తక్షణం కేంద్ర కేబినెట్ నివేదిక తీసుకుని ఆర్టికల్ 360 కింద అత్యవసరపరిస్థితిని విధించాలని రాష్ట్రపతిని రఘురామకృష్ణంరాజు లేఖలో కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: