తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. అన్న ప్రసాద కేంద్రం లో సంప్రదాయ భోజనం పేరుతో కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని టిటిడి ఈవో కే ఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. తిరుమలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో పదిహేను ముప్పై రోజుల్లో గో ఆధారిత సాగు ద్వారా పండించిన పంటతో సంప్రదాయ భోజనం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

వసతి సముదాయాలు అతిథి గృహాలలో గీజర్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అలిపిరి నడక మార్గాని సెప్టెంబర్ చివరి వరకు పూర్తి చేసి భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా కోయంబత్తూర్ ఆశీర్వాద ఆయుర్వేద ఫార్మసీ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మరోవైపు ఆలయంలో ఉపయోగిస్తున్న పువ్వులతో తయారు చేసిన అగర్బత్తి లను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని... మొదట తిరుమలలో వీటిని విక్రయిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: