మైనంప‌ల్లికి కేంద్రం షాక్ ఇచ్చేందుకు సిద్ద‌మైంది. తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ చెప్పిన‌ట్టుగా కేంద్రానికి మైనంప‌ల్లి హ‌నుమంత‌రావుపై ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. దాంతో మల్కాజిగిరి ఇష్యూని జాతీయ ఎస్సి కమిషన్ సీరియ‌స్ గా తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే రేపు ఢిల్లీ నుండి  హైదరాబాద్ కు జాతీయ ఎస్సికమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ అల్డర్ వ‌స్తున్నారు. బాధితులను కలిసి ఎస్సి కమిషన్ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. ఆయన అనుచరులు దళిత మహిళను కులం పేరుతో దూషించార‌ని చెబుతూ దళిత సంఘాలు ఎస్సీ క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లాయి. అంతే కాకుండా అంబెడ్కర్ ఫోటోను కాళ్ళతో తన్ని అవమానించార‌ని కూడా ద‌ళిత సంఘాలు ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. మ‌రోవైపు ఆందోళనకు దిగిన దళిత మహిళలను అరెస్టు చేసి పెట్ భాషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి వరకు ఉంచడాన్ని  కూడా ఎస్సీ కమిషన్ సీరియ‌స్ గా ప‌రిగ‌నిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: