వైసీపీ సర్కార్ పై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.  రాష్ట్రంలో పట్టపగలు ఒక అమ్మాయిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేస్తుంటే... చూస్తున్న సమాజాన్ని చూసి సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేటుగా పాఠశాల నడుపుతున్న ఇద్దరు ఉపాథ్యాయులు... ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అమ్మఒడి కి ఇచ్చిన డబ్బులు నాన్న బుడ్డికి వెళ్తున్నాయంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన రఘురామ... ఇలాంటి విచిత్ర స్కీమ్ ల ద్వారా ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. ప్రస్తుతం టీచర్లకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయన్నారు. కరోనా కట్టడికి వేల కోట్లు ఖర్చు చేశామని ఉంటున్న ప్రభుత్వ... ఎంత ఖర్చు చేసిందో మాత్రం చెప్పటం లేదన్నారు. మూడు నెలల్లో జరిగిన ఘటనల వల్లే సీఎం జగన్ ర్యాంకు పడిపోయిందన్న రఘురామ... ఇంట్లో కూర్చున్న వ్యక్తిని నాయకుడు అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎంత మంది కాళఅలు పట్టుకున్నా కూడా తన అనర్హత అంశం ఏమీ కాదన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తరలింపు కొనసాగుతుందన్న రఘురామ.. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ట్రక్కు ఇసుక దొరకడం లేదన్నారు. ఉచితంగా దొరికే ఇసుకను ఏకంగా 25 వేల రూపాయలకు కొనుగోలు చేశారన్న రఘురామ... ఇదే ప్రభుత్వ వైపల్యం అని ఆరోపించారు. తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేసేది లేదన్న రఘురామ కృష్ణంరాజు... ఎన్నికల్లో తన బొమ్మ పెట్టుకునే గెలిచామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: