పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి, ఇక తాజాగా అలీ ఆయనకు శుభాకాంక్షలు వెల్లడించారు. మరో సంవత్సరం ముగుస్తుంది, మరొక సంవత్సరం ప్రారంభమవుతుంది, రాబోయే సంవత్సరం స్నేహితుల నవ్వు, కుటుంబ ప్రేమ మరియు మీరు కలలు కనే జీవితంతో నిండి ఉంటుంది, పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు అంటూ అలీ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు  మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం మరియు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ  రోజు మొత్తం సోషల్ మీడియాలో పవన్ నామస్మరణ మారుమ్రోగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: