నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత నాని శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన సినిమా జగదీష్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు టీజర్, ట్రైలర్ విడుదల కాగా అభిమానులను ఎంతో అలరించాయి. తాజాగా ఈ సినిమా నుండి "సల్లాడి కుండలో సల్ల సక్క మనసు వాడు" అనే పాటను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా ఈ పాటను దర్శకుడు శివ నిర్వాణ సొంతంగా రాయగా ఆయనే తన గొంతుతో పాడారు కూడా.. ఇక దర్శకుడు శివ నిర్వాణ గొంతుతో తమన్ మ్యూజిక్ తో ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సినిమా విడుదల తేది (సెప్టెంబర్ 10) దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ పాటను కూడా సినిమా యూనిట్ విడుదల చేసినట్లు కనిపిస్తోంది. నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ తర్వాత సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ మేరకు హిట్ వుతుందో చూడాలి. ఇదిలా ఉంటే భూ తగాదాల నేపద్యంలో ఈ చిత్రం  తెరకెక్కుతోందని ఫిలిం నగర్ లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమాలో హీరో నాని కూడా సింపుల్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని కి జంటగా రీతువర్మ తో పాటు ఐశ్వర్య రాజేష్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: