తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే, ఇప్పటికే ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఒక వారం కూడా పూర్తి చేసుకోబోతోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, ఈ వారం ఎలిమినేషన్స్ లో యాంకర్ రవి, కాజల్, హమీద, జెస్సీ,మానస్  అలాగే సరయు ఉన్నారు. అయితే శనివారం నాడు జరిగిన ఎపిసోడ్ ప్రకారం యాంకర్ రవి అలాగే హమీదా సేఫ్ అయ్యారు.  ప్రస్తుతానికి కాజల్, జెస్సీ, సరయు, మానస్ డేంజర్ జోన్ లో ఉన్నారు,  కానీ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి శని ఆదివారాల ఎపిసోడ్ శనివారం షూట్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాలు ముందే లీక్ అవుతున్నాయి. తాజాగా లీక్ అవుతున్న విషయం మేరకు సరయు కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు అని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది ఈ రోజు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: