భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్ లు కొన‌సాగుతున్నాయి. బీఎస్ ఈ సూచీ సెన్సెక్స్ 60 వేల మార్కును దాటి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ ఏడాది సెన్సె క్స్ జ‌న‌వ‌రిలో 50వేల మార్కుకు చేరుకోగా ఇప్పుడు ఏకంగా 60వేల మార్కును దాటి రికార్డు క్రియేట్ చేసింది. కేవ‌లం ఎనిమిది నెల‌ల్లోనే 60వేల మార్కును చేరుకోవ‌డం చెప్పుకోదగ్గ విష‌యం. ఇక ఆరు నెల‌లో నిపుణుల అంచ‌నాలను సైతం సెన్సె క్స్ దాటిపోయింది.  అంతే కాకుండా సెన్సెక్స్ 381 పాయింట్లు లాభ‌ప‌డింది. 

ప్ర‌స్తుతం 60,227 పాయింట్ల ద‌గ్గ‌ర ట్రేడ్ అవుతోంది. మ‌రో వైపు నిఫ్టీ 102.5 పాయింట్లు లాభ‌ప‌డి 17,921 ద‌గ్గ‌ర ట్రేడ్ అవుతోంది. మారుతి టీసీఎస్, ఏషియ‌న్ పెయింట్స్ లాభాల‌లో ఉండ‌గా స‌న్ ఫార్మా, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టైటాన్ ల షేర్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ఇక క‌రోనా సెకండ్ వేవ్ తో ఈ మార్కెట్ పుంజుకోవ‌డం శుభ‌ప‌రిణామం అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: