ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ మధ్య అన్ని విషయాల్లో హై కోర్టుతో మొట్టికాయలు వేయించుకుంటున్న సంగతి తెలిసిందే, తాజాగా సిఆర్‌డిఎ కేటాయించిన 10 ఎకరాల భూమిలో కృష్ణానది నుండి ఇసుకను నిల్వ చేయకుండా నీటి పారుదల శాఖను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటి వరకు నీటి పారుదల శాఖ డీసిల్టింగ్ పనులు ప్రారంభించలేదని స్పెషల్ జిపి కోర్టుకు తెలిపారు, పిటిషనర్ సమర్పించిన ఫోటోగ్రాఫిక్ ఆధారాలు సబ్జెక్ట్ సైట్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కేటాయించిన భూమికి సంబంధించినవి కాదన్న హై కోర్టు సరైన ఆధారాలు సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడమే కాక  కేసును 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు, చూడాలి మరి ఏం జరగనుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: