ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పూరీకి 590 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, కళింగపట్నానికి 740 కి.మీ. తూర్పుగా కేంద్రీకృతమై ఉందని అంటున్నారు. ఇక ఇది ఆదివారం నాటికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది, ఆ తర్వాత 24 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి, దక్షిణ ఒడిసాలోని గోపాల్‌పూర్‌, ఉత్తర కోస్తాలో విశాఖపట్నం మధ్య కళింగపట్నానికి సమీపాన తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక  ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, ఆదివారం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా స్తాంతాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని అంటున్నారు. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవ్వొచ్చని తెలంగాణ, ఛత్తీన్‌గఢ్‌లోనూ కొన్నిచోట్ల భారీ వానలు పడతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: