ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను బాగా కంగారు పెడుతున్నాయి అనే చెప్పాలి. శబరి, గోదావరి నదులలో పెరుగుతున్న నీటిమట్టం ఇప్పుడు గోదావరి జిల్లాల ప్రజలను కంగారు పెడుతుంది. భద్రాచలం వద్ద  నీటిమట్టం నలభై మూడు అడుగులకు చేరడం తో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు అధికారులు.

కూనవరం వద్ద ముఫ్ఫై తొమ్మిది అడుగులకు చేరిన వరద... మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కూనవరం మండలం కోండ్రాజుపేట కాజ్ వే పైన వరదనీరు చేరడంతో  పన్నెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకులేరు వాగు రహదారి పైకి చేరడంతో వి.ఆర్.పురం ,చింతూరు మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. అకాల వరదలతో వరి, మిర్చి పంటలు ముంపుకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: