గత ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొందరి మీద కేసులు పెట్టడం సంచలనం అయింది. రాజకీయంగా ఇప్పుడు టీడీపీ నేతల మీదనే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది అనే భావన కూడా ఉంది. ఇక ఇప్పుడు తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్లా కుటుంబం పై భూ ఆక్రమణ కేసు నమోదు కావడం సంచలనం అయింది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ,టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు గల్లా రామచంద్రనాయడు తో సహా 12 మంది పై కేసు నమోదు చేసారు పోలీసులు.

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి  కోర్టులో ప్రైవేటు కేసు వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు కేసుల నమోదు చేసారు పోలీసులు. దిగువ భాగానికి చెందిన రైతు గోపి కృష్ణ తన పొలాన్ని గల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిన పడిందంటూ కోర్టులో కేసు వేసారు గోపీ. దీనిపై చిత్తూరు నాలుగో అదనపు  కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap