చ‌ట్టవిరుద్ధ సెటిలర్లు 2050నాటికి అస్సాం అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బ్లూప్రింట్ సిద్ధం చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ ఆరోపించారు. వీరు వేర్వేరు నియోజకవర్గాల్లో క్రమంగా మెజారిటీ సంఖ్యకు చేరుతున్నారని, తాను ఇంటెలిజెన్స్, ఇతర సంస్థల నివేదికలను చూసి ఈ విషయాన్ని తెలియ‌జేస్తున్నాన‌న్నారు. ధెమజిలో జరిగిన ఓ కార్యక్రమంలో శర్మ మాట్లాడారు. కొన్ని వర్గాలు అస్సాంలో అధికారాన్ని చేజిక్కించుకుని, 2050నాటికి రాష్ట్ర జనాభా తీరును మార్చేందుకు కుట్ర పన్నిన‌ట్లు త‌న‌ద‌గ్గ‌ర స‌మాచార‌ముంద‌న్నారు. ఇటీవల డరంగ్ జిల్లాలోని సిపఝర్ రెవిన్యూ సర్కిల్‌లో, గోరుఖుటి గ్రామంలో కొందరిని ఖాళీ చేయించడానికి చేసిన ప్రయత్నాలను ఆయ‌న గుర్తుచేశారు. ఇక్కడ సెటిల్ అయినవారిలో అత్యధికులు ఈ ప్రాంతానికి చెందినవారు కాదని, డల్గావ్, బాగ్‌బోర్ వంటి ప్రాంతాల నుంచి వచ్చారని చెప్పారు. సిపఝర్ని నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే వీరి లక్ష్యమని, వీరు దశలవారీగా భూములను ఆక్రమించుకుంటారన్నారు. ఇప్పటికే వీరు నాగావున్ జిల్లాలోని బటడ్రోబా నియోజకవర్గాన్ని స్వాధీనం చేసుకోవ‌డంతోపాటు మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిప‌త్యం సాధించార‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp