నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి " విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్" కార్య క్రమాన్ని ఏర్పాటు చేయాలనీ ఉద్దేశించారు . " విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్"ను గాంధీ జయంతి రోజు ప్రారంభించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు వరకు డిసెంబర్ 9 వరకు కార్యక్రమాన్ని కొనసాగించాలని అని రేవంత్ రెడ్డి అనుకున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులకు ,నిరుద్యోగులకు పిలుపునిచ్చిన మాట విదితమే. ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభించాలి అనుకున్నాము.


 కానీ ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ 100 మంది పోలీసు బలగాలు మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రగతి భవన్ వైపు కూడా పాదయాత్రను కొనసాగించే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం దిల్షుక్నగర్ నుండి సాయంత్రం నాలుగున్నర తర్వాత ఎలాగైనా పాదయాత్రను కొనసాగించాలని ప్రకటించారు .

మరింత సమాచారం తెలుసుకోండి: