జనసేన అధినేత ప‌వన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభ ఆయన రాజకీయ ఎదుగుదలకు నాంది అని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలనే వ్యాఖ్యలను తాను సమర్ధిస్తున్నామన్నారు. దానికి పవన్ సారథ్యం వహించడాన్ని కూడా స్వాగతిస్తున్నామన్నారు. కమ్మ కులస్థులకు రెడ్డి కులస్తులు వ్యతిరేకమని, కాపు కులస్తులు కాద‌ని జోగ‌య్య స్ప‌ష్టం చేశారు. జనసేన రాజ్యాధికారం దక్కించుకుంటే పరిపాలన ఈ నాటి ప్రభుత్వ పాలనలా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించేవ‌న్నారు. పవన్ ప్రతిపాదనలు ఆహ్వానించదగ్గ విధంగా ఉన్నాయని, జనసేనాని ప్రతిపాదనలను కాపు సంక్షేమ సేన ఆహ్వానిస్తుందన్నారు. కాపు మంత్రులు పవన్ కళ్యాణ్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం వెనక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని, పవన్‌ని అవమానపరచడం అంటే... కాపు సమాజాన్ని అవమానించ‌డ‌మేన్నారు. ఇటువంటి చర్యలకు పర్యవసానం 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రి చూడాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: