పశ్చిమ బెంగాల్‌ భవానీపూర్‌, జంగిపూర్, సంసెర్గంజ్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది నేడు. భవానీపూర్ స్థానం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్‌ నమోదు అయిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

భవానీపూర్‌  నియోజకవర్గం అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు మమత. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉన్న సంగతి తెలిసిందే. భవానీపూర్‌ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: