పశ్చిమ బెంగాల్‌ భవానీపూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తృణ‌మూల్ కాంగ్రెస్ అభ్యర్థి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆమె తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై 58 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ విజ‌యంతో మ‌మత ముఖ్యమంత్రి పదవికి చిక్కులు తొలగిపోయాయి. 2011 శాసన సభ ఎన్నికల్లో వామపక్షాలను మమత బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ ఓడించింది. 34 ఏళ్ళ వామపక్షాల పాలనకు తెరదించిన ఆ ఎన్నికల్లో ఆమె 49,936 ఓట్ల ఆధిక్యంతో ఘ‌నవిజ‌యాన్ని సాధించారు. తాజాగా భవానీ పూర్ ఉపఎన్నికలో  రికార్డుల‌ను తిరగరాశారు. ప్ర‌త్య‌ర్థిపై ఆమె  58,832 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో షంషేర్ గంజ్, జంగీపూర్ శాసన సభ నియోజకవర్గాలకు కూడా భ‌వానీపూర్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గాల్లో కూడా టీఎంసీ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఆరునెల‌ల క్రితం వెల్ల‌డైన బెంగాల్ ఫ‌లితాల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసిన మ‌మ‌త 1600 ఓట్ల‌తేడాతో ఓట‌మిపాల‌య్యారు. తిరిగి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నిల‌బెట్టుకోవ‌డం కోసం ఆరునెల‌ల్లోగా ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌ల్సి ఉండ‌గా ఆమె త‌న సొంత నియోజ‌క‌వ్గం భ‌వానీపూర్‌ను ఎంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tmc