సెప్టెంబర్ 30న రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జర‌గ్గా ఫలితాలను ఆదివారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాల‌ను అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే ఒడిశాలోని ఒక స్థానాన్ని అధికార బిజూ జనతాదళ్‌ గెలుచుకుంది. బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలైన జాంగిపూర్, శంషేర్‌గంజ్‌లతో పాటు భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మమతాబెన‌ర్జీ  పార్టీ ఘ‌న‌విజయం సాధించింది. భవానీపూర్ నుంచి స్వయంగా మమత పోటీకి దిగి 71 శాతం ఓట్లు సాధించారు. ఇక జాంగిపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి జాకిర్ హొస్సేన్, శంషేర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా టీఎంసీ అభ్యర్థే అమిరుల్ ఇస్లామ్ ప్ర‌త్య‌ర్థుల‌పై విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. ఇక ఒడిశాలో ఏకైక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేడీ అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి అతి సులువుగా విజ‌యం సాధించారు. సీట్ల‌తోపాటు ఓటుబ్యాంకులో కూడా బీజేపీ వెన‌క‌బ‌డిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp