లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. యూపీ ఘటన త‌న‌ను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌ను చూసి షాక్ తిన‌డంతోపాటు, భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని, బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను’’ అని కేటీఆర్  పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పూర్తిస్థాయిలో విచార‌ణ జ‌రిపి నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే వీడియోను ప్రియాంకాగాంధీ కూడా షేర్ చేశారు. అనుమ‌తి లేకుండా త‌న‌ను 28 గంట‌ల‌పాటు నిర్బందించార‌ని మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదేనా ప్ర‌జాస్వామ్య పాల‌న అంటే అని నిల‌దీశారు. రెండురోజులుగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖీంపూర్‌ఖేరీ ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి మౌనం మాత్రం వీడ‌టంలేద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr