లఖింపూర్ కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని, ఇది వేడుక‌లు జరుపుకునే సమయం కాదని సమాజ్‌‍వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం లక్నోలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రైతులను కోల్పోయిన విషాదంలో యూపీ ఉందని, వేడుక‌లు జరుపుకునేందు ఇదెంత మాత్రం సమయం కాదన్నారు. ప్రధాని మోదీ లక్నోలో జరిగే ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో 74 అర్బన్ డవలప్‌మెంట్ ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేయబోతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తోపాటు భార‌తీయ జ‌న‌తాపార్టీకి చెందిన ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరుకానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: