స్టైలిష్ స్టార్ బన్నీ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా వైల్డ్ లుక్ తో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే బన్నీ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర యూనిట్ రాష్మీక లుక్ విడుదల చేయగా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక తాజాగా పుష్ప సినిమా నుండి చిత్ర యూనిట్ మరో అప్డేట్ ప్రకటించింది. అక్టోబర్ 13న పుష్ప నుండి సెకండ్ సింగిల్ వదులుతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా రష్మిక ఎర్ర చీర కట్టుకుని ఉన్న ఫోటోను కూడా చిత్ర యూనిట్ షేర్ చేసి సెకండ్ సింగల్ పై అంచనాలను భారీగా పెంచింది. ఇదిలా ఉంటే బన్నీ సుక్కు కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య 2 చిత్రాలు సూపర్ హిట్ గా నిలవడంతో పుష్ప సినిమాపై భారీ అంచనాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: