ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిప‌డ్డారు. ‘‘యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?’’ అని నిల‌దీశారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలని, తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదని.. గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతని షర్మిల ఘాటువ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు 20 మందికి గాను ఆరుగురే ఉన్నారని, 67 శాతం ఖాళీలు ఉన్నాయని, ఏ యూనివర్సిటీ అయినా ఇదే పరిస్థితి అన్నారు.  ‘‘ఇక్కడి వీసీ ఈ పోస్టు కోసం రూ.2 కోట్లు ఇచ్చారంట‌.. వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తున్నారు’’ అని ష‌ర్మిల అన్నారు. టెంపరరీ ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారని, 570 ఎకరాల్లో పదో వంతు టీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేశారని షర్మిల నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: