తెలంగాణ యూనివర్సిటీ గేట్ వద్ద వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రొఫెసర్లు 20 మంది కి గాను ఆరుగురు ఉన్నారు అని 67 శాతం ఖాళీలు ఉన్నాయి అని తెలిపారు. ఏ యూనివర్సిటీ అయినా ఇదే పరిస్థితి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఖాళీ యూనివర్సిటీ లుగా తయారు చేశారు అని విమర్శించారు. ఇక్కడి వీసీ ఈ పోస్టు కోసం 2 కోట్లు ఇచ్చాడట.. వాటిని ఎలా సంపాదించుకోవాలా అని చూస్తున్నారు అని అన్నారు.

టెంపరరీ ఉద్యోగులను నియమించి భారీ అవినీతికి పాల్పడ్డారు అని ఆమె మండిపడ్డారు. 570 ఎకరాల్లో పదో వంతు టీఆరెస్ నాయకులు కబ్జా చేశారు అన్నారు. కేసీఆర్ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు. యువతకు 5 శాతం ఉద్యోగాలు.. మీ కుటుంబంలో వంద శాతం ఉద్యోగాలా?  అని నిలదీశారు. కేటీఆర్ షేమ్ ఆన్ యూ.. అసెంబ్లీలో చేసిన ప్రకటనకు సిగ్గు పడాలి.  తెలంగాణ ప్రజలు సోమరిపోతులు కాదు.. గడీలో బతికే కేసీఆర్ సోమరిపోతు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts