సభలో ఎస్సి వర్గీకరణ పై రాజసింగ్ వర్సెస్ ప్రశాంత్ రెడ్డి గా యుద్ధం నడిచింది. రాజా సింగ్ మాట్లాడుతూ... ఎస్సి వర్గీకరణ పై తెలంగాణ ప్రభుత్వం మాట తప్పింది అని అన్నారు. గతంలో అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు స్పందించడం లేదు అని ఆరోపణలు చేసారు. ముప్పై ఏళ్ల నుండి ఎస్సి వర్గీకరణ అంశం నడుస్తుంది అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని ఎప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లిన వచ్చేందుకు తాము రెడీ అన్నారు.

వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీ లో తీర్మాణం చేసి పంపిన వారి కేంద్ర ప్రభుత్వం నాన్చుతుంది అని ఆరోపించారు. ఎస్సి వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన విమర్శలు చేసారు. కేంద్రమే కావాలని ఈ విషయంలో తత్సరం చేస్తుంది అని ఆయన విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts