తెలంగాణ సాధించాక ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం,  ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి అంటూ అధికారం లోకి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అధికారం లోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటకు తూట్లు పొడిచారు. ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం సంగతి ఏమో కానీ అవసరమైన రక్షణ శాఖకు మాత్రం నోటిఫికెషన్స్ విడుదలచేసి నియామకం చేసుకున్నారు. మరి నిరుద్యోగ భృతి ఎప్పుడో మరచి పోయారు.


ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. నేను ఆలా అనలేదని వాపోతున్నారు మన కెసిఆర్ సారు. ప్రతి దళితునికి మూడు ఎకరాల భూమి ఉండొచ్చని చెప్పాము కానీ ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని అన్నారు. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి కేసీర్ మాట్లాడుతూ రెండెకరాలు ఉన్న దళితునికి ఇంకో ఎకరం , ఒకటిన్నర ఎకరం ఉన్న దళితునికి మరో ఒకటిన్నర ఎకరం ఇస్తామని చెప్పలేదని మంగళవారం నాడు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు కెసిఆర్ సారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR