భవానీపూర్ ఉప ఎన్నికలో గెలుపొందిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ శాస‌న‌స‌భ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జగదీప్ ధనకర్ సమక్షంలో మమతా బెన‌ర్జీతోపాటు గెలుపొందిన ఇత‌ర ఎమ్మెల్యేలు అమీరుల్ ఇస్లామ్, జాకీర్ హొసైన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఆరునెల‌ల క్రితం జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో 1600 ఓట్ల తేడాతో ఓటమి పాలైన విష‌యం తెలిసిందే. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమత ఆరునెల‌ల్లోగా ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉండ‌టం అనివార్యమైంది. దీంతో త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం భ‌వానీపూర్ నుంచి బరిలోకి దిగ‌డంతో సెప్టెంబ‌రు నెల 30న భవానీపూర్‌తోపాటు ముర్షీదాబాద్ జిల్లాలోని జంగీపూర్, షంషేర్‌గంజ్ స్థానాలకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉప ఎన్నికలు నిర్వ‌హించింది. భవానీపూర్ నుంచి బ‌రిలోకి దిగిన దీదీపై ప్ర‌త్యర్థిగా బీజేపీ నేత ప్రియాంక టిబ్రేవాలా పోటీ చేశారు. ఆమె 58 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mla