సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ..కేంద్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర‌మే అంటూ వ్యాఖ్యానించారు. మన దగ్గర నుండి కేంద్రం కు పోయే నిధులే ఎక్కువ ఉన్నాయ‌ని.. అక్కడి నుండి వచ్చేది తక్కువ అని చెప్పారు. కేంద్రం కు ఎక్కువ డబ్బులు ఇచ్చే స్టేట్ తెలంగాణ అని చెప్పారు. కేంద్రం మనకు ఇచ్చేది చాలా తక్కువే అని అన్నారు. కేంద్రం ఇచ్చేది పన్నుల్లో వాటా మాత్రమేనని...ఆ నిధులు ఆటోమేటిక్ గా వచ్చేవేన‌ని కేసీఆర్ చెప్పారు.

కేంద్రం నుండి వచ్చేది... కేంద్రం స్పాన్సర్డ్ నిధులు మాత్రమేన‌ని కేంద్రం కు కొన్ని డిపార్ట్ మెంట్ లు ఇక్కడ ఉండవని కేసీఆర్ తెలిపారు. స్కూల్..దవాఖానకు కేంద్రం కి  ఏముంటదండీ అని వ్యాఖ్యానించారు.  బీజేపీ..కాంగ్రెస్ వైఖరి ఈ విషయం లో  దొందు దొందే అంటూ కేసీఆర్ చ‌మ‌త్క‌రించారు. ఇందిరాగాంధీ నుండి ఇప్పటి వరకు రాష్ట్రాల అధికారులను కేంద్రం లాక్కుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం దగ్గర సూట్ కేసుల‌లో డబ్బులు ఉండవని రోజు వారిగా వస్తు ఉంటాయని కేటీఆర్ వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: