కొవిడ్-19 టీకాలు తీసుకున్నవారు దుర్గా పూజల సందర్భంగా పుష్పాంజలి, సిందూర్ ఖేలాలలో పాల్గొనడానికి కోల్‌క‌తా హైకోర్టు అనుమ‌తిచ్చింది.  భారీ స్థాయిలో దుర్గా పూజలు నిర్వహించే పందిళ్ళలో 45-60 మంది, చిన్న పందిళ్ళలో 10-15 మంది మాత్రమే పాల్గొనాలని, సందర్శకులపై గత ఏడాది విధించిన ఆంక్షలు ఈ ఏడాది కూడా కొన‌సాగించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దుర్గా పూజ పందిళ్ళలోనికి సందర్శకుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని, పందిళ్ళ బయట తప్పనిసరిగా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పందిళ్ళలో ప్రవేశించే పూజా కమిటీల సభ్యుల సంఖ్యపై పరిమితి విధించ‌డంతోపాటు సందర్శకులపై నిషేధం కూడా విధించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ సౌమేంద్ర నాథ్ ముఖర్జీ న్యాయ‌మూర్తుల‌కు తెలిపారు. దుర్గా పూజ పందిళ్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధిస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి సంబంధించి కోర్టులో స‌వాల్‌చేయ‌గా పైమేర‌కే న్యాయ‌మూర్తులు తీర్పు వెలువ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: