తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి భారతీయ జనతా పార్టీ నేతల చేరికలు తామ‌ర‌తుంప‌ర‌లుగా కొన‌సాగుతున్నాయి. గురువారం బీజేపీ నేత సబ్యసాచిదత్త తృణ‌మూల్ తీర్థం పుచ్చుకున్నారు. కోల్‌కతాలోని తృణ‌మూల్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, పార్థా చటర్జీల నేతృత్వంలో ఆయ‌న టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో ఒకరిద్దరు నేతలతో తనకు విబేధాలున్నాయని, ఆ కార‌ణంవ‌ల్లే తాను తృణ‌మూల్‌లో చేరిన‌ట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ గూటిని వీడి కమల పార్టీలో చేరిన తనను ముఖ్య‌మంత్రి దీదీ స్వయంగా వెనక్కి రమ్మని ఆహ్వానించార‌ని సబ్యసాచి దత్త చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలోకి భారీగా వ‌ల‌స‌లు కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తృణ‌మూల్లో నెంబ‌ర్ టూగా ఉన్న సుబేందు అధికారి బీజేపీలో చేరి మ‌మ‌తాపై పోటీచేసి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిని దీదీ అధికారం చేప‌ట్టాక అదే స్థాయిలో బీజేపీ నుంచి టీఎంసీలోకి వ‌ల‌స‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈరోజు మ‌మ‌తా బెన‌ర్జీ ఎమ్మెల్యేగా కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp