ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో చేరేందుకు మన దగ్గర ఒప్పుకోరు, మ‌ర‌ల  కోర్టుకు వెళ్తారు. పల్లె- పట్టణ ప్రగతి ప్రోగ్రాం ద్వారా 2లక్షల 33వేల పోల్స్ ఏర్పాటు చేశాం. గతంలో బోరుబావుల్లో పిల్లలు పడి మృత్యువాత పడేవారు. గడిచిన ఏడాదిన్నర నుంచి బోరుబావుల్లో పిల్లలు పడ్డ ఘటన ఒక్క‌టీ కూడా చోటు చేసుకోలేదు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోరుబావులను పూర్తిగా మూసేయించాం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ప్రతీ గ్రామానికి పంచాయ‌తీ సెక్రటరీని ఏర్పాటు చేశాం.

 గత ప్రభుత్వాలు చెట్లు నాట‌లేదు. అభివృద్ధి చెయ్యలేదు.. ఇప్పుడు రెండు జ‌రుగుతున్నాయి. గతంలో ఎమ్మెల్యేల నిధులు బోర్ల మరమ్మతులకే  సరిపోయేది.  త్వ‌ర‌లోనే  ప‌ల్లె, గ్రామ దావఖానాలు రానున్నాయి.  కేంద్రం నిధులు ఇచ్చిందని బీజేపీ నాయ‌కులు గొప్ప‌లు చెబుకుంటారు. కానీ తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువ‌... కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చే నిధులు చాలా తక్కువ అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాల హ‌క్కుల‌ను కాప‌డ‌డం కోసం కేంద్రంపై పోరాటం చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇదే అంశంపై త‌మ‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలెన్ త‌న‌కు ఓ లేఖ రాశాడ‌ని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ప్ర‌ధానిగా ఉన్న‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ప్ర‌ధాని వ‌ర‌కు రాష్ట్ర అధికారాల‌ను కేంద్రం లాక్కుంటుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జీఎస్‌టీ పేరుతో టాక్స్ లు పెట్రోల్‌, డీజిల్ పన్నులు లాక్కుందాం అంటే  బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.  మెట్రో నగరాల అభివృద్ధి కోసం ఏడాదికి 20వేల కోట్లు పెట్టాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తే మేము ఏమైనా చెడగొట్టమా అని ప్ర‌శ్నించారు. గతం కంటే ఇప్పుడు గ్రామాలు అభివృద్ధి జరగడం లేదా అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను అడిగారు. రాష్ట్రాల హ‌క్కుల‌ను హ‌రించ‌డంలో కాంగ్రెస్‌, బీజేపీ దొందు దొందే అని సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. హైదరాబాద్ పాతనగరంను ఇస్తాంబుల్ చేస్తా అని కలకనోద్దా? అని ప్ర‌శ్నించారు. కరీంనగర్ ను డల్లాస్ చేస్తామ‌ని నేను అన‌లేదు. లండన్ బ్రిడ్జ్ చేస్తా అని అన్న‌ట్టు ప్ర‌క‌టించాడు. హైద‌రాబాద్ ఒక అంత‌ర్జాయ న‌గ‌రం అని.. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఐదు మెట్రో న‌గ‌రాల్లో మ‌న‌ది ఒక‌టి అని సీఎం స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: