అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌మీపంలో ఉన్న టిబెట్ భూభాగంలో బ్ర‌హ్మ‌పుత్ర‌లోయ‌మీదుగా చైనా వ్యూహాత్మ‌క నిర్మాణాన్ని పూర్తి చేసింది. యర్లుంగ్ జంగ్‌జో, గ్రాండ్ లోయ‌ల‌ మీదుగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ చేరువ‌లో ఉన్న బైబంగ్ కౌంటీ వ‌ర‌కు ఈ దారి నిర్మించారు.  తాజాగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చైనా  ఆర్మీ చొచ్చుకొచ్చింది. దీంతో ఇండియా - చైనా జవాన్ల మద్య తోపుసలాట జ‌రిగింది. దాదాపు వారం రోజుల కింద ఈ వ్య‌వ‌హారం జ‌రిగింది. తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. సరిహద్జు రేఖ వద్ద ప్రోటోకాలింగ్ చేస్తున్న సమయంలో  ఇరు దేశాల సైనికులు ఎదురుప‌డ్డారు. అదేసమయంలో తమ నియంత్రణ రేఖ దాటి వచ్చారంటూ పరస్పరం తోపుసలాట చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చైనా జవాన్ల కంటే మన జవాన్లే ఎక్కువ మంది ఉన్నారు. తోపుస‌లాట‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేదు అని భార‌త సైన్య అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘటన తర్వాత ఇరు దేశాలకు సంబందించిన కమాండర్ స్థాయి జవాన్లు చర్చల తర్వాత గోడవ సద్దుమనిగింది. రెండు దేశాల మద్య ఉన్న ఒప్పందాలకు తాము కట్టుబడి ఉన్నామని భారత సైన్యం ప్ర‌క‌టించింది.  అరుణాచల్ ప్రదేశ్ - చైనా సరిహాద్దు దగ్గర ఇప్ప‌టివ‌ర‌కు  అధికారికంగా ఎలాంటి సరిహద్దు రేఖ లేదు. కానీ ఈ ఘ‌ట‌న జ‌రిగాక  ఇరుదేశాలు తమ సరిహద్దు రేఖను నియంత్రించుకున్నాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ ప్రాంతం అంటూ చైనా పేర్కొంటుంది. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా భార‌త్ భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: