ఎయిడెడ్ అధ్యాపకులు ప్రభుత్వం లోకి తీసుకోవడం వల్ల కాంట్రాక్ట్ అధ్యాపకులు నష్టం ఉండదని గతం లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వం లోకి విలీనం తో కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్వాసన పలుకుతూ సర్కులర్ జారీ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. 22 సంవత్సరాలుగా క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్న వారికి మొండిచేయి చూపడం తో పాటు విధుల నుండి తొలగించారు.

ఈ సర్కులర్ దెబ్బకు సుమారు 700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఇళ్ళకు వెళ్ళే అవకాశం ఉంది. పాదయాత్రలో తమను సర్వీసుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి సీఎం జగన్ మోసం చేశారంటున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు... నేడు అన్ని ఆర్ జె డి కార్యాలయాల ముందు నిరసన కు సిద్ధం అవుతున్నారు. మీ పోస్ట్ ల జోలికి రాము అంటూనే నమ్మించి వారు ఆఖరు నిముషం లో గొంతుకోసారంటూ ఏపీ ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap