కేంద్రంతో పోరాటం అనేది సుద్ద తప్పు అన్నారు తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ, అమిత్ షా కేసీఆర్ ను దగ్గరకు తీస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదు అని ఆయన విమర్శలు చేసారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ కు వచ్చిన ప్లైట్ కేసీఆరే అరెంజ్ చేశాడు అని వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు కేసీఆర్ హరీష్ ను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అని అన్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్ కు ప్రమాదం, ఆ తర్వాత కిషన్ రెడ్డికే ప్రమాదం అని  వ్యాఖ్యలు చేసారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts