మా ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్రాంగ‌ణంలో న‌ట‌కిరీటి, ఒక‌నాటి మా అధ్య‌క్షులు రాజేంద్ర ప్ర‌సాద్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ నేమ‌న్నారంటే.. పోటీ ఉంటేనే ఫ‌లితం వేరేగా ఉంటుంది..మా ఎన్నిక‌ల్లో పోటీ అనేది నాతోనే మొద‌లైంది. అది ఇవాళ ఇంత‌టి ఆస‌క్తి క‌ర స్థాయికి చేరుకోవ‌డం మంచిదే! ఇది ఆరోగ్య‌క‌ర ప‌రిణామమే.. పోటీలో ఎవ్వ‌రు గెలిచినా ఒక్క‌టే! మా అసోసియేష‌న్ కు అంతా మంచి జ‌ర‌గాల‌ని,ఆ మంచి అంద‌రికీ మేలు చేయాల‌ని కోరుకుంటున్నాను. మీ అంద‌రిలో ఆస‌క్తి రేపిన ఎన్నిక‌లు ఆనందంగా జ‌రగాలి అని మ‌న‌స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను..అని చెప్పారాయ‌న. మ‌రోవైపు మా ఎన్నిక‌ల ప్రాంగ‌ణంలో ఉత్సాహభ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంది. మ‌రో మూడు గంట‌ల్లో ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగియ‌నుంది. ఇక అధ్య‌క్షుడు ఎవ్వ‌ర‌యినా తాను వారితో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని చిరు వ్యాఖ్యానించి, ఆశాజ‌నక సంకేతాలు ఇచ్చి వెళ్లారు. అదేవిధంగా రోజా కూడా హుందాగా మాట్లాడి, అధ్య‌క్షుడు ఎవ్వ‌రైనా, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై ఇరు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల పెద్ద‌ల‌తో కృషి చేయాల‌ని చెప్పి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: