మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జ‌రిగాయి. ముఖ్యంగా ఎన్నిక‌లు ప్రారంభం కాక మునుపు ప్ర‌కాశ్ రాజ్, మోహ‌న్ బాబు ప‌ర‌స్ప‌రం మాట్లా డుకున్నా రు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఆశీర్వాదం తీసుకున్నారు ప్ర‌కాశ్ రాజ్. ఈ పరిణామం అక్క‌డి వారినంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. నిన్న‌టి దాకా ఒక‌రినొక‌రు తిట్టుకుని, దూ షించుకుని, దూష‌ణ స్థాయి దాటి మ‌రీ! ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుని, విమ‌ర్శ‌లు పెంచుకుని పోయిన వీరిద్ద‌రూ తామంతా ఒక్క‌టే అని చాట‌డంతో అక్క‌డున్న వారం తా అవాక్క‌య్యారు. టెలివిజ‌న్ మాధ్య‌మాల్లో ఒక‌టి రెండు సార్లు ఈ విజువ‌ల్స్ బ్రాడ్ కాస్ట్ కావ‌డంతో వీటిపై ప‌లువురు పెద‌వి విరిచారు కూడా! మ‌రోవైపు ప‌వ‌న్ రాక సంద‌ ర్భంగా కొన్ని ఆస‌క్తిదాయ‌క ప‌రిణామాలు న‌మోదు అయ్యాయి. ముందు మంచు మ‌నోజ్ ఆయ‌న‌ను క‌లిసి కౌగిలించుకుని, యోగ క్షేమాలు పంచుకున్నారు. 


త‌రువాత విష్ణు వెళ్లి ప‌వ‌న్ ను కౌగిలించుకుని, కొన్ని నిమిషాల పాటు ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉన్న రోజా కూడా వీరి న‌వ్వుల్లో భాగం అయ్యారు. మోహ‌న్ బాబు, విష్ణు, మ‌నోజ్ వీళ్లంతా ప‌వ‌న్ తో చాలా  సేపు మాట్లాడి, ఎన్నిక‌లకు సంబంధించిన వివ‌రాలు కాకుండా ఇంకొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా పంచుకుని ఒక‌రిపై ఒక‌ రు అభిమానం చాటుకున్నారు. మ‌రి! రిప‌బ్లిక్ వేడుక‌ల్లో మోహ‌న్ బాబుపై ప‌వ‌న్ ఎందుకు ఫైర్ అయ్యార‌ని..? ఇంత మంచి స్నేహం ఉంటే ఆ రోజెందుకు అంత‌గా కోపం అ య్యార‌ని? ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ గా నిలిచే రోజా ఎందుక‌నో సైలెంట్ అయిపోయారు. వివాదాలు వ‌ద్దే వ‌ద్ద‌ని విన్నవించ‌డం ఓ కొస‌మెరుపు.



ఈ విష‌యంలో చిరు, బాల‌య్య లాంటి అగ్ర న‌టుల జాబితాలో చేరిపోయారు. హుందాగా మాట్లాడ‌డంలో ప‌వ‌న్, రోజా ఇద్ద‌రూ కూడా మంచి మార్కులే ద‌క్కించుకున్నారు. ఇదే సంద‌ర్భంలో వీరి  కోప‌తాపాలు అన్నీ తాత్కాలిక‌మే అని తేలిపోయాక చేసేదేముంద‌ని మిగ‌తా న‌టీన‌టులు వ్యాఖ్యానించుకున్నారు.  కానీ ఇదే సంద‌ర్భంలో కేవ‌లం ఎన్నిక‌ల కోసమే ఒక‌రినొక‌రు స్థాయిని దాటి తిట్టుకోవ‌డ‌మే బాగాలేద‌న్న విమ‌ర్శ ఒక‌టి ఆత్మీయ ఆలింగనాలకు సంబంధించి దృశ్యాల‌ను చూశాక విన‌వ‌స్తున్న కామెంట్.


 

మరింత సమాచారం తెలుసుకోండి: