మ‌రికొద్ది సేప‌ట్లో పోలింగ్ ముగియ‌నుంది. మ‌రో రెండున్నర గంట‌ల్లో పోలింగ్ కు సంబంధించి ప్ర‌క్రియ‌ను ముగించుకుని, భోజ‌న విరామం అనంతరం లెక్కింపును ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే సీనియ‌ర్ న‌టులు చిరు, బాల‌య్య, మోహ‌న్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రోజా, ప్ర‌కాశ్ రాజ్, విష్ణు తో స‌హా ఇత‌ర స‌భ్యులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా రోజా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగానే కొన్ని మాట‌లు వ‌స్తాయ‌ని, వాటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా చెబుతున్నారు.  తాను కూడా ఓ రాజ‌కీయ పార్టీకి ప్రతినిధిగా ఉన్నాన‌ని కానీ టాలెంట్ కే అగ్ర‌భాగం ఉంటుంద‌ని చెప్పారు. అదేవిధంగా ఎన్న‌డూ లేని విధంగా ఇటువంటి వాతావ‌ర‌ణం నడుమ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం భావ్యంగా లేద‌ని ఇంకొంద‌రు అంటున్నారు. అయితే సీనియ‌ర్ న‌టులు పోస్ట‌ల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నా, యంగ్ హీరోలు తార‌క్, మ‌హేశ్ బాబే కాదు అగ్ర హీరోలు వెంకీ, నాగ్ కూడా రాలేదు. అదేవిధంగా చాలా మంది న‌టులు ఈ ఎన్నిక‌ల‌కు గైర్హాజ‌ర‌య్యారు. కొంద‌రికి షూటింగ్ లు ఉన్న కార‌ణంగా రాలేద‌ని కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: