బెజవాడలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు ఇంద్రకీలాద్రి పై రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనం ఇస్తారు. ఉదయం అన్నపూర్ణ దేవి గా దుర్గమ్మ దర్శనమిస్తారు అని ఆలయ అధికారులు పేర్కొన్నారు . మధ్యాహ్నం శ్రీ మహాలక్ష్మీ దేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ... ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నపూర్ణాదేవి గా దర్శనమిస్తున్నారు.

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైన అలంకారం అని అధికారులు చెప్తున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్టసంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్మీలుగా మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు దుర్గమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: